హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం మహిళల నిరసన

ASR: అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ మండపర్తిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. పాత ట్యాంక్‌ బీటలు వారడంతో నీరు లీకవుతూ వృథా అవుతోందని గ్రామస్తులు తెలిపారు. ఏళ్లుగా ట్యాంక్‌, కుళాయిలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.