హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్: ఖమ్మంలో ట్రాన్స్‌ఫార్మర్ల తిప్పలు..!

KMM: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ మోటార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఏర్పడిన ఓవర్ లోడ్ కారణంగా జిల్లాలోని 34,455 ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తినా రైతులు వెంటనే 18004250028 టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించాలని అధికారులు సూచించారు.