హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సమాచారంపై కానిస్టేబుల్‌కు రివార్డు

ADB: సిరికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 98 గంజాయి మొక్కలపై సమాచారం అందించిన కానిస్టేబుల్ యోగేష్‌కు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రూ.5 వేల నగదు రివార్డు అందజేశారు. గంజాయి నిర్మూలనలో చురుగ్గా పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. గంజాయి మొక్కలపై సమాచారం ఉన్న ప్రజలు 8712659973 నంబర్ వాట్సాప్ ద్వారా వివరాలు పంపాలని ఎస్పీ సూచించారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.