NRML: లక్ష్మణచందా మండలం న్యూ కంజర్‌లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులతో సమావేశమైన ఆయన భూముల పట్టాలకు సంబంధించిన సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్


