హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైన్ షాపులు వద్దంటూ మహిళల ఆందోళన

E.G: గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రెండు వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండటంతో కుటుంబాలు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం సమర్పించారు.