హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ భవనం ప్రారంభం

SKLM: కవిటి మండలం కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని బుధవారం ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌ బాబు ప్రారంభించారు. చిన్నారులకు మెరుగైన వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.