VZM: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్‌కోట సీఐ విఎన్ మూర్తి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎస్.కోటలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమ లక్ష్యసాధనకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'


