హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదాము వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాము వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు. బుధవారం గోదామును తనిఖీ చేసిన ఆమె సీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రికార్డులను పరిశీలించారు. 24 గంటల పాటు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ, పటిష్ట బందోబస్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.