హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరటి మొక్కలు పీకేసిన గుర్తుతెలియని వ్యక్తులు

KDP: సిద్ధవటం (M) భాకరాపేటలో రైతు పి.రాజశేఖర్‌రెడ్డి సాగు చేసిన అరటి మొక్కలను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పీకేశారని రైతు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.పెద్దపల్లి రెవెన్యూ సర్వే నంబర్‌ 661లో రెండు నెలల క్రితం సాగు చేసిన పంటను బుధవారం పరిశీలించగా మొక్కలు పీకివేసి, పాదముద్రలు కనిపించాయని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు తెలిపారు.