హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100% గ్రాస్ వేతనం కోసం ధర్నా

ప్రకాశం: మార్కాపురం జీజీహెచ్ ప్రాంగణంలో కాంట్రాక్ట్, పారామెడికల్ సిబ్బంది బుధవారం ధర్నా నిర్వహించారు. తమను రెగ్యులర్ చేసి 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ల్యాబొరేటరీ, స్కానింగ్, ఎక్స్‌రే సిబ్బంది ఆందోళనలో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.