హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కులం పేరుతో దూషణ.. కేసు నమోదు

PPM: జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన ఎలూరు సురేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అదే గ్రామానికి చెందిన రెడ్డి చిట్టీరాజుతో పాటు స్థానికులను కులం పేరుతో దూషించినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఎస్సై నీలకంఠరావు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ ఎం.రాంబాబు బాధితుల నుంచి ఇవాళ వివరాలు సేకరించారు.