హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

అన్నమయ్య: గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిట్వేల్‌లో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. డీపీవో సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రతి నెల 5లోపు వేతనాలు చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని తెలిపారు.