హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా త్వరగా సిద్ధం చేయండి: RDO

WG: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో వార్డుకు 2,510 మంది ఓటర్లు ఉండేలా జాబితాను వేగంగా సిద్ధం చేయాలని RDO సూర్యారావు ఆదేశించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వార్డుల విభజనపై వార్డు, పంచాయతీ సెక్రటరీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డు సరిహద్దులను పక్కాగా నిర్ణయించి మార్పులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఏసుబాబు పాల్గొన్నారు.