హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరలి–తుమ్మలపల్లి రోడ్డుకు శ్రీకారం

BPT: కర్లపాలెం మండలం పేరలిలో రూ.2 కోట్ల నిధులతో చేపడుతున్న పేరలి–తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రహదారి పూర్తయితే రెండు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు.