హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూఆక్రమణ ఆరోపణలపై బహిరంగ సవాల్: మాజీ మంత్రి

WNP: కేఎస్ఐ పంపులను నిర్విరామంగా నడిపి జూరాల నుంచి నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 12లోగా నార్లపూర్ పంపులు ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. తనపై భూఆక్రమణ ఆరోపణలను రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.