హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22వ రోజుకు చేరుకున్న VRAల ధర్నా

ELR: న్యాయమైన హక్కుల సాధన కోసం ఉంగుటూరు మండల VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం బుధవారం 22వ రోజుకు చేరింది. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు ఐక్యంగా ధర్నా కొనసాగిస్తున్నారు. VRAలకు పే స్కేల్ కల్పించాలని, VRAలకు VROలుగా ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్నారు.