హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తైక్వాండోలో కోనసీమ చిన్నారి మెరుపు

కోనసీమ: ఇండోర్‌లో జరిగిన 40వ సబ్ జూనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో మలికిపురం మండలం గెద్దాడకు చెందిన 7వ తరగతి విద్యార్థిని లాహితీ తేజ స్వర్ణ పతకం సాధించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా క్లబ్ తరఫున పాల్గొని ఈ ఘనత సాధించింది. విజేత లాహితీ తేజను స్థానికులు అభినందించారు.