హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్‌ మోసాలపై అప్రమత్తతే ఆయుధం: SP

MHBD: సైబర్‌ మోసాల నుంచి రక్షణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని జిల్లా SP డా. శబరీష్‌ అన్నారు. కురవి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో నిర్వహించిన సైబర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫేక్‌ ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో వచ్చే బెదిరింపులను నమ్మొద్దని సూచించారు.