SKLM: ఎచ్చెర్ల పంచాయతీలో నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే చెత్త వేయాలని, ఎక్కడపడితే అక్కడ వేయొద్దని పంచాయతీ కార్యదర్శి విజయ సాగర్ బుధవారం తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.1000 జరిమానా, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో గోడలపై 'ఈ ప్రదేశములో ఎటువంటి చెత్త వేయరాదు' అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చెత్త వేస్తే రూ.1000 జరిమానా'


