హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనదుర్గ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు

MDK: ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు శ్రీ వనదుర్గాదేవి వివిధ విశేష అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 15న అమ్మవారికి బోనాలు, 19న చండీ హోమం, సువాసిని పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం నిత్య అన్నదాన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.