GNTR: ఫిరంగిపురంలోని అన్నా క్యాంటీన్‌ను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం సందర్శించి పరిశీలించారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడారు. భోజనం నాణ్యతగా అందిస్తున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే


