హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో కలిసి ఈవీఎం గోదాంను పరిశీలించారు. గోదాం సీల్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఈవీఎంల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. గోదాం వద్ద నిరంతరం పటిష్ట నిఘా కొనసాగించాలని సూచించారు.