హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ దుకాణంలో జేసీ తనిఖీలు

VZM: చీపురుపల్లి మండలంలోని ఎఫ్‌పీ షాప్ నంబర్ 223009ను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తనిఖీ చేశారు. దుకాణంలోని సరుకుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించి, స్టాక్ వివరాలను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.