హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లారీ ఢీకొని యువకుడి తీవ్ర గాయాలు

WGL: గీసుకొండ జానపాక కావేరి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో గిండేటి వంశీ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది EMT నాగరాజు, పైలట్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వంశీని వరంగల్‌ MGM ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.