కోనసీమ: అమలాపురంలో కాలువల పూడికతీత, గుర్రపుడెక్క, చెత్త వ్యర్థాల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కుమ్మరి కాలువ పూడికతీత పనులను బుధవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతోపాటు రక్షణ గోడ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువల పూడికతీత వేగంగా పూర్తి చేయండి: కలెక్టర్


