NDL: బనగానపల్లె నుంచి మద్దిలేటి స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్టీసీ బస్సు యాగంటి సమీపంలో ప్రమాదానికి గురైంది. బోల్టులు కట్ కావడంతో అదుపుతప్పిన బస్సు కల్వర్టును ఢీకొంది. బస్సులోని 11 మంది ప్రయాణికులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కండిషన్‌లో లేని బస్సులు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
బోల్టులు కట్.. కల్వర్టును ఢీకొన్న బస్సు


