హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈఐఆర్‌తో పోయిన ఫోన్ రికవరీ

KNR: సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. బొమ్మకల్‌లోని చల్మెడ ఆసుపత్రి మెడికల్ విద్యార్థి డాక్టర్ సాయిప్రకాశ్ ఫోన్ పోయిందని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్‌ను పెద్దపల్లిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.