హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా

SKLM: జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టారు. బహిరంగ ప్రదేశాలు, నది తీర ప్రాంతాల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. బహిరంగంగా గంజాయి సేవించడం, మద్యం సేవించడం, జూదం వంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.