TPT: తిరుపతి ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు ఆ కార్యాలయ అధికారి శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 5 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ మేళా ద్వారా 420 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
9న తిరుపతిలో జాబ్ మేళా


