హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ బస్సుల్లో నిబంధనలు పాటించాలి..!

ELR: విద్యార్థుల భద్రతకు విద్యాసంస్థల బస్సుల్లో రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం సూచించారు. మంగళవారం 150 మంది బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. బస్సులకు ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు చెల్లుబాటులో ఉండాలన్నారు. డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు.