హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో డ్రగ్స్ పట్టివేత

విశాఖ సీపీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ (సెక్యూరిటీ వింగ్) ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మంగళవారం గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో తనిఖీలు నిర్వహించగా కేజీ హాష్ ఆయిల్, 10.9 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.