హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే

KRNL: కర్నూల్ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ నూరుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆమె రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి వెంటనే వారిని ఆదుకోవాలని ఆమె పేర్కొన్నారు.