ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం కొండబోయినపల్లి సమీపంలో మంగళవారం మోటార్‌సైకిల్ బోల్తాపడి ఎలిజబెతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. రేగులచెలకకు చెందిన బాలస్వామి, ఎలిజబెతమ్మ సీఎస్‌పురం వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ గాలికి బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎలిజబెతమ్మ ఎడమ కాలు విరిగింది. 108 సిబ్బంది ఆమెను పామూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ బోల్తా.. మహిళకు తీవ్ర గాయం


