హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

VZM: రాజాం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే రేగిడి పంప్‌హౌస్‌లో రెండు VT పంపులు సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 24 వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని కమీషనర్ రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు మరమ్మతులు చేపడుతున్నామని అది పూర్తయిన వెంటనే యధావిధిగా తాగునీరు సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.