హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో వర్షాలు

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 35, 36, రాత్రి 25.3, 25.4 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈశాన్యం దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.