హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో నేడు ‘సేవా సంకల్ప జ్యోతి యాత్ర

BPT: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవా మాసోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటలకు బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపం వద్ద ‘సేవా సంకల్ప జ్యోతి యాత్ర’ ప్రారంభం కానుంది. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొండారెడ్డి అనిల్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ కాపు కళ్యాణ మండపం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ యాత్ర సాగుతుందని తెలిపారు.