హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా గస్తీ..!

కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు నేరాల నివారణే లక్ష్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు రాత్రి గస్తీ నిర్వహించారు. ప్రార్థనా మందిరాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచి, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కోరారు.