హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో వైసీపీకి షాక్..!

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూండ్ల రమణారెడ్డి, రాము యాదవ్ టీడీపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్‌రాజు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ పాల్గొన్నారు.