హైదరాబాద్: 28°C
వ్యాపారం

జీఎస్టీ రేట్లలో నో ఛేంజ్..!

జీఎస్టీ రేట్లలో ఈసారి ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 8న జరగనున్న GST కౌన్సిల్ సమావేశంలో పన్నుల మార్పు కంటే.. కేవలం విధానపరమైన, నిర్మాణాత్మక సంస్కరణలపైనే దృష్టిసారించే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపాయి. ఈ సమావేశంలో ఎజెండాలో రిజిస్ట్రేషన్​, రీఫండ్లు, విధాన, నిర్మాణాత్మక సంస్కరణలే ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి.