హైదరాబాద్: 28°C
వ్యాపారం

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్ మరో ఫీచర్‌ను తీసుకొస్తుంది. లింక్డ్ డివైజ్‌లలో వ్యక్తిగత చాట్‌ల గోప్యతను కాపాడేందుకు 'రిస్ట్రిక్టెడ్ చాట్స్' ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఎంపిక చేసిన చాట్‌లను ప్రైమరీ మొబైల్‌లో మాత్రమే చూసేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది. లింక్ చేసిన ఇతర డివైజ్‌లలో ఆ సందేశాలు కనిపించవు. మీడియా ఆటోసేవ్, మెటా ఏఐ వినియోగంపైనా పరిమితులు ఉంటాయి.