హైదరాబాద్: 28°C
క్రీడలు

2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్

2036 ఒలింపిక్స్ కోసం భారత్, ఖతార్ ప్రధానంగా పోటీపడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) తెలిపింది. ఈ రెండు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, కొరియా, జర్మనీ, హంగరీ, తుర్కియే కూడా పోటీలో ఉన్నట్లు వెల్లడించింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్ దాఖలు చేయడానికి ఈ నెల 31 వరకు గడువు ఉంది. 2029లో జరిగే ఓటింగ్ ద్వారా IOC ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనుంది.