హైదరాబాద్: 28°C
భక్తి

రేపు ఉ.10 గంటలకు విడుదల

AP: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ ఉత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని, అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించింది.