హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం బోగోలు మండలంలో పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బోగోలు మండలం వ్యాప్తంగా 14 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.