హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ కెమెరాల నిఘాలో పెద్దపులి కదలికల గుర్తింపు

E.G: సీతానగరం మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పెదకొండేపూడి, చీపురుపల్లి గ్రామాల పరిసరాల్లో పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పులి సంచారాన్ని పసిగట్టి ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు