హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తక్షణమే బియ్యం పంపిణీ చేయండి'

AKP: తుఫాను, వాయుగుండం పరిస్థితుల వల్ల జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయాలని పూడిమడక మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. పూడిమడకతో పాటు పలు తీర గ్రామాల్లో అనేక కుటుంబాలు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు.