సత్యసాయి: కనీస వేతనాలు చెల్లించి, పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు ఎంపీ బీకే పార్థసారథికి మెమోరాండం ఇచ్చారు. మంగళవారం మడకశిర రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందజేశారు. ఎంపీ అందుబాటులో లేకపోవడంతో ఆయన అల్లుడు శశిభూషణ్ పటేల్‌కు అందజేశారు. సమాన పనికి సమాన వేతనం, సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని వినతి


