హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టైరు పేలి బోల్తాపడిన కారు

CTR: తెల్లగుండ్లపల్లి సమీపంలోని ఆరు లైన్ల జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.