హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తిన్నాక 20 నిముషాలు నడవడం ఎందుకు?

భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తుంటారు. తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి ఈ అలవాటు చాలా ఉపయోగపడుతుంది.