హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రేపే వినుకొండలో మెగా జాబ్ మేళా

PLD: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను పల్నాడు జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీ.వీ. ఆంజనేయులు కోరారు. ఈ జాబ్ మేళాలో 35 కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వినుకొండలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా మూడవది అన్నారు.