హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు 3 మేకలు, 2 గొర్రెలు మృతి

అన్నమయ్య: కేవీ పల్లి మండలం నూతన కలువ గ్రామం పెద్దకంబిరెడ్డిగారిపల్లిలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ దర్బార్ భాషకు చెందిన 3 మేకలు, 2 గొర్రెలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి మృతి చెందిన పశువులకు పరిహారం అందించాలని బాధితుడు కోరాడు.